డ్రగ్స్, గంజాయి, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టామని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు అన్నారు. డ్రగ్స్‌తో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ రాకెట్(drugs rocket) అంతా దిల్లీ కేంద్రంగా జరిగిందని తెలిపారు. నగరంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న 18 మంది రౌడీ షీటర్ల(rowdy sheeters)కు నగర బహిష్కరణ విధించామని వెల్లడించారు. కొత్తగా 116 మందిపై రౌడీ షీట్స్ తెరిచామన్న సీపీ... వారికీ కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు.
3 వేల మంది పై సస్పెక్ట్ షీట్స్ పెట్టి అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టామని సీపీ శ్రీనివాసులు చెప్పారు. 14 వందల వాహనాలను సీజ్ చేసి 4 వేల మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 6 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసి 570 మంది పై చర్యలు తీసుకున్నామన్నారు. గంజాయి వినియోగదారులను గుర్తించి.. వారిలో మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు. ఈ అంశంపై కళాశాలల్లో విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు.
ఇదీచదవండి.