ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో విజయవాడ సీపీ బి. శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని వరంగల్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో(Vijayawada Cp Srinivasulu review on crime) మావోయిస్టు దాడుల్లో తన సిబ్బంది ముగ్గురు లాండ్మైన్ పేలి చనిపోయిన ఘటన ఎంతో కలచివేసిందని శ్రీనివాసులు గుర్తు చేసుకున్నారు. పోలీసులకు సవాల్‌గా నిలిచిన కేసులను సాంకేతికతను వినియోగించి ఛేదించామన్నారు. ఒక్క ఏడాదిలోనే ఒకేసారి మూడు ఏబీసీ అవార్డులు పొందిన ఘనత విజయవాడ పోలీసులకు దక్కటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా సమయంలో పోలీసులు ధైర్యంగా పని చేశారని కొనియాడారు.
నగరంలో గంజాయి విక్రయాలు, సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్న ఆయన.. 50 మందికి పైగా గంజాయి విక్రేతలను గుర్తించామని(Cp Srinivasulu on crime report) చెప్పారు. గత ఏడాదిన్నరలో రూ. కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నగరంలో 45 మంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులను గుర్తించి.. వారి ఆగడాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి..
Vijayawada CP on FD fraud case: 'రూ.2 కోట్లు రికవరీ చేశాం.. ఇంకా రూ.8 కోట్లు రావాలి'