న్యాయవాదిపై యాసిడ్ దాడి చేసిన కేసును విజయవాడ కోర్టు కొట్టేస్తూ తీర్పు నిచ్చింది. 14 ఏళ్ల కిందట న్యాయవాది వేల్పూరి శ్రీనివాసరెడ్డిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విజయవాడలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిపింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవటంతో కేసును కొట్టేస్తూ నేడు న్యాయస్థానం తీర్పు నిచ్చింది. రెండేళ్ల కిందట బాధితుడు శ్రీనివాస రెడ్డి కరోనాతో మృతి చెందాడు. అప్పట్లో సంచలనం రేపిన ఈ ఘటనపై పలు రాజకీయ ఆరోపణలు సైతం వచ్చాయి.
ఇవీ చూడండి :