విజయవాడ రెడ్‌జోన్ ప్రాంతాలలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని... నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. నగరంలోని రెడ్‌జోన్ ప్రాంతాలైన మారుతీనగర్, గాంధీ నగర్, సింగ్ నగర్ ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఆ ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వాహణ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి గ్లౌజులు, పేస్ ఫీల్డ్‌లను పంపీణీ చేశారు. దూరప్రాంతాల నుంచి విధులకు వచ్చేవారి కోసం అదనంగా మరో రెండు వాహనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెడ్‌జోన్ ప్రాంతాలలో అనవసరంగా బయట తిరుగుతున్న వారిని కమిషనర్ హెచ్చరించారు.
విజయవాడ రెడ్‌జోన్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ - vijayawada red zones
విజయవాడలోని రెడ్‌జోన్ ప్రాంతాలలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పర్యటించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆయన గ్లౌజులు, ఫేస్ ఫీల్డ్‌లను అందజేశారు.