విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిఘాను మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో రెడ్జోన్లలో నిఘా ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి: