Veterinarians: సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు వెళ్లినందుకు.. ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడం దారుణమని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ పశు వైద్య సంచార వాహనాలలో పని చేస్తున్న వెటర్నరీ డాక్టర్లు వాపోయారు. సీఎ జగన్ పాదయాత్ర సమయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో మొబైల్ వెటర్నరీ క్లినిక్లలో పనిచేస్తున్న వైద్యులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారని విజయవాడలో ఆరోపించారు. ప్రభుత్వమే మొబైల్ క్లినిక్ నిర్వహిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి... నేడు ఆ బాధ్యతను జీవీకే సంస్థకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు సంస్థ వద్ద ఉద్యోగం కోసం ఒక్కొక్కరి నుండి రూ.20 వేలు వసూలు చేసిందని తెలిపారు. ఉద్యోగంలో చేరి పది రోజులు గడిచినా తమకు ఇప్పటివరకు నియామక పత్రం ఇవ్వకపోవడం, రూ.50 వేలు జీతంగా చెప్పి రూ.31 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియామక పత్రాల కోసం తాము సమ్మెకు వెళితే.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వైద్యులను నిధుల నుంచి తొలగించాలన్నారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: