కొవిడ్ బాధితుల సమస్యలకు 104 కాల్ సెంటర్ ద్వారా 4 గంటల్లోనే పరిష్కారం చూపాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆయన సందర్శించి, పనితీరును పరిశీలించారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పడకల కొరత పెద్దగా లేదన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామమని..,రోగులకు కావాల్సిన ఆక్సిజన్ అందిస్తామని తెలిపారు.
ఇదీచదవండి: 48 గంటల్లో జిల్లాలకు ట్రూనాట్ కిట్లు: కొవిడ్ నోడల్ అధికారి