ఉదయం 9 గంటల తరువాత ఎవరూ బయట తిరగవద్దని హెచ్చరించినా కారణం లేకుండా కొంత మంది ద్విచక్రవాహనాలు, కార్లలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పటమట పోలీసులు మంగళవారం సీఐ సురేష్ రెడ్డి నేతృత్వంలో ఎన్టీఆర్ సర్కిల్, బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్ వద్ద తనిఖీలు చేశారు. 48 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక ఆటోను సీజ్ చేశారు. సమయం దాటిన తరువాత తెరిచి ఉన్న 13 దుకాణాల యజమానులపై, రోడ్లపై తిరుగుతున్న 72 మందిపై కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్ తరువాతే వాహనాలను తిరిగి ఇస్తామని సీఐ తెలిపారు.
చిట్టినగర్‌లో..
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్న వంద కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి చిట్టినగర్ ఈద్గా మహల్ ప్రాంగణంలో ఉంచినట్లు సీఐ ఉమర్ తెలిపారు.
పెనమలూరులో...
పెనమలూరు పోలీసులు ఒకే రోజు 38 వాహనాలను స్వాధీనం చేసుకుని 42 మందిపై కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: