ETV Bharat / city

ఆయనొస్తే... రోడ్డుపైనే వాహనాలు.. జనాలకు తప్పని ఇబ్బందులు - ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎదుట అడ్డగోలుగా పార్కింగ్

Vehicles parking on Road: ఉమ్మడి కృష్ణా జిల్లాకు అయనే ఏకైక మంత్రి. అందుకే పట్టణంలోకి ఆయన వచ్చాడంటే చాలు.. అభిమానులు, వైకాపా నేతల భారీగా వస్తుంటారు. ఆ సమయంలో రోడ్డుపై విచ్చలవిడిగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దాంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

పార్కింగ్
పార్కింగ్
author img

By

Published : Jun 29, 2022, 8:08 AM IST

విజయవాడ బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోకి మంత్రి వచ్చారంటే చాలు ఆ భవనం ఎదుట రహదారిపై మూడు వరుసల్లో కార్లు బారులు తీరుతుంటాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఏకైక మంత్రి అయిన మంత్రి జోగి రమేష్‌ తరచూ ఇక్కడికి వస్తుంటారు. ఆ సందర్భంలో ఆయన్ను కలిసేందుకు అభిమానులు, వైకాపా నేతలూ వస్తుంటారు. వీరంతా తమ వాహనాలను అతిథి గృహం ఎదుట ఉన్న రోడ్డుపైనే నిలుపుతున్నారు. మంగళవారం మంత్రి రావడంతో భవనం ఎదుట పార్కింగ్‌ చేసిన కార్లను చిత్రంలో చూడొచ్చు.

బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎదుట రోడ్డుపై వాహనాల పార్కింగ్

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.