గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు... పరిషత్ ఎన్నికల్లో దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం జరిగిందని... ఎస్ఈసీకి తెలిపినట్లు తెదేపా నేత వర్ల రామయ్య తెలిపారు. 2014లో ఎంపీటీసీలు 2 శాతం ఏకగ్రీవాలు కాగా.. ఇప్పుడు 24 శాతం ఏకగ్రీవాలు చేశారన్నారు. వైకాపా నేతలు, అధికారులతో బెదిరించి దౌర్జన్యంగా బలవంతంగా ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. 2014లో జడ్పీటీసీలు 9 శాతం ఏకగ్రీవమయ్యాయని, ఈసారి బలవంతంగా 19 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు.
గతంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యమైందని ఎస్ఈసీ దృష్టికి తెచ్చామన్నారు. ఏకగ్రీవాలపై మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు గతంలో రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరామని, అలా కాకుండా ఎన్నికలు కొనసాగిస్తే అప్రజాస్వామ్యంగా జరిగినట్లేనని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రజాస్వామ్యయుత పద్దతుల్లో జరపాలని ఎస్ఈసీని కోరారు.
ఇదీ చదవండి: