అమరావతి-వాణిజ్య ఉత్సవం-2021 పేరిట విజయవాడలో ఎగుమతుల ప్రోత్సాహక అంశాలపై సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉత్సవాన్ని ప్రారంభించనుండగా..అందుకు సంబంధించిన పోస్టర్ను మంత్రులు గౌతమ్ రెడ్డి, కన్నబాబు ఆవిష్కరించారు. నగరంలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్సవం నిర్వహించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని మంత్రులు తెలిపారు. వాణిజ్య ఉత్సవానికి వివిధ దేశాలకు చెందిన భారత ఎంబసీల ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి