ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు, సీపీయస్ రద్దు, డీఏ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ మార్చి 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్(యూటీఎఫ్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాబురెడ్డి తెలిపారు. విజయవాడ కార్యాలయంలో నిరసనకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్నా... ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో పీఆర్సీకి నిధులు కేటాయించాలని... మూడు విడతల డీఏను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :