వైకాపా మేనిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. విజయవాడ యూటీఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండేళ్లు గడిచినా పీఆర్సీ అమలు చేయడం లేదని .. సీపీఎస్ రద్దు హామీని అమలు చేయాలని ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వార్షిక క్యాలెండర్ ప్రకటించారు కానీ... స్పష్టమైన విద్యా ప్రణాళిక లేదని బాబురెడ్డి అన్నారు. ఆన్ లైన్ తరగతులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: