ETV Bharat / city

జాబ్ క్యాలెండర్ రీకాల్ చేయాలని నిరుద్యోగుల నిరసన - విజయవాడలో నిరుద్యోగుల నిరసన

జాబ్ క్యాలెండర్​ను రీకాల్ చేసి అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పరిచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు.

జాబ్ క్యాలెండర్ రీకాల్ చేయాలని నిరుద్యోగుల నిరసన

author img

By

Published : Jun 20, 2021, 6:01 PM IST

జాబ్ క్యాలెండర్​ను రీకాల్ చేసి అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ తీవ్ర ఆవేదనకు గురిచేసిందని వారు వాపోయారు. అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు.

ఇప్పటికే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని.. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 36 వేల పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్​ను రీకాల్ చేసి అన్ని పోస్టులను భర్తీ చేసే వరకు అన్ని విద్యార్థి యువజన సంఘాల కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఐక్య ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.