గత కొన్ని రోజులుగా తనపై ఒ వర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందని తన వివరణ లేకుండా ఫాబ్రికేటెడ్ వీడియోలు, ఆడియోలను ప్రచురితం చేస్తున్నాయని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని... నిజాలు తేలేవరకు వేచి ఉండకుండా టీఆర్పీ రేట్ల కోసం వార్తలను వండి వారుస్తున్నారని ద్వజమెత్తారు. తాను ఒక దళిత ఎమ్మెల్యేనని.. తనను గౌరవించాల్సిందిపోయి... అనగదొక్కాలని చూడడం బాధేస్తోందని పేర్కొన్నారు. నిజాలు తెలుసుకుని.. తన వివరణకాని, పోలీసుల వివరణకాని తీసుకున్న తరువాతనే ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని కోరారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ సీరియస్.. క్యాంపు కార్యాలయానికి విశాఖ నేతలు