ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm - ap latestnews top news

.

top news @9pm
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : May 22, 2020, 8:59 PM IST

  • కృష్ణా బోర్డు ఉత్తర్వులు

రాష్ట్రానికి తాగునీటి అవసరాల కోసం నీళ్లు విడుదల చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు బోర్డు 2 టీఎంసీలు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోర్టులు తప్పుబట్టినా..

డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు జగన్​మోహన్​రెడ్డి ప్రభుత్వానికి, ఏపీ పోలీస్ వ్యవస్థకు చెంపపెట్టని తెదేపా నేతలు విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఎంగా కొనసాగే అర్హత ఉందా..?

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిపై కేసులు పెట్టి, అరెస్ట్ చేసే వారికి సీఎంగా కొనసాగే అర్హత లేదని గతంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను దేవినేని ఉమామహేశ్వరరావు గుర్తుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పట్టపగలే ...చోరీ

ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సునే కొట్టేశాడో ఘనుడు. పట్టపగలు బస్సును డిపో నుంచే ఎత్తుకెళ్లాడు. అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో నుంచి బస్సును ఎత్తుకెళ్తుండగా డిపో సిబ్బంది.. వాహనం వెనకాలే ప్రయాణించి.. పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేరళలో మళ్లీ కరోనా పంజా

కేరళలో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. శుక్రవారం 42 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఒక్కరోజులో రాష్ట్రంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తమిళనాడులోనూ కొవిడ్​ ప్రతాపం చూపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒడిశాకు రూ.500 కోట్లు

అంపన్​ తుపానుతో అతలాకుతలమైన ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. విహంగ వీక్షణం ద్వారా పరిస్థితులను పరిశీలించారు. తక్షణ సాయం కింద రూ. 500 కోట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోటి ఉద్యోగాలు!

రవాణా రంగంలో మార్పులు చేస్తే కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చని పేర్కొంది అంతర్జాతీయ కార్మిక సంస్థ. పర్యావరణహిత వాహనాలపై దృష్టి సారిస్తే.. కర్బన ఉద్గారాలు, వాయు, శబ్ద కాలుష్యాలు కూడా తగ్గుతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గూగుల్​​పై కేసు.. ఎందుకంటే..?

'కుడివైపు తిరగండి.. ఎడమ వైపు వెళ్లండి.. ఇప్పుడు యూటర్న్​ తీసుకోండి.. మీరు చేరాల్సిన గమ్యం వచ్చేసింది.' అంటూ బయల్దేరిన చోటుకే తీసుకొస్తుంటాయి కొన్ని మ్యాపింగ్​ యాప్​లు. తమిళనాడులో ఓ వ్యాపారితోనూ ఇలానే ఆడుకుందట గూగుల్​ మ్యాప్స్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆలోచించి ప్రపోజ్ చేశా..

దగ్గుబాటి హీరో రానా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. మిహీకా బజాజ్​ను ప్రేమించి వివాహం చేసుకోబోతున్నారు. తాజాగా మంచు లక్ష్మితో ఓ లైవ్​ చాట్​లో పాల్గొన్న రానా పలు విషయాలను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్ కన్నా ప్రపంచకప్ ముఖ్యం

టీ20 ప్రపంచకప్​ జరగాల్సిన సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే తాను ఒప్పుకోనని అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ సారథి అలెన్ బోర్డర్. డబ్బు కోసమే ఐపీఎల్ నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.