- Election Results: ‘పుర’ ఓట్ల కౌంటింగ్.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే..?
మిగిలిపోయిన మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపా సత్తా చాటింది(Andhrapradesh municipal election results news). కీలకమైన కుప్పం, నెల్లూరు నగర పాలకను కైవసం చేసుకుంది(YSRCP wins in Kuppam news). రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ పథకాలు నచ్చే ప్రజలు వైకాపాను గెలిపించారు: పెద్దిరెడ్డి
తమ ప్రభుత్వ పథకాలు నచ్చే కుప్పం ప్రజలు వైకాపాను గెలిపించారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. దొంగ ఓట్లు వేశారంటున్న తెదేపా ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గవర్నర్ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్
గవర్నర్ బిశ్వభూషణ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ నెల 15న జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలిందని వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- YS VIVEKA MURDER CASE: వివేకా హత్యకేసు.. సీబీఐ అదుపులో అనుమానితుడు శివశంకర్‌రెడ్డి
వైఎస్ వివేకా హత్యకేసు(YS.Viveka murder case)లో అనుమానితుడు శివశంకర్ రెడ్డిని(Shiva Shankar Reddy) సీబీఐ అధికారులు(CBI officers) అదుపులోకి తీసుకున్నారు. శివశంకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. సీబీఐ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టీవీ ఛానళ్లలో చర్చల వల్లే ఎక్కువ కాలుష్యం: సుప్రీం
దిల్లీలో వాయు కాలుష్యం(delhi air pollution) తీవ్ర రూపం దాల్చింది. అందుకు పంట వ్యర్థాలను తగలబెట్టటం(stubble burning in delhi), వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే విషవాయువులు కారణమని తెలుసు. అయితే.. టీవీ ఛానళ్లలో చర్చల వల్లే అన్నింటికంటే ఎక్కువ కాలుష్యం(tv debates cause more pollution) ఏర్పడుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అందుకు కారణమేంటి? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆ యాచకుడి అంతిమ యాత్రకు ఇసుకేస్తే రాలనంత జనం!
కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ యాచకుడి అంతిమ యాత్ర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు కారణం.. అతడి కడసారి వీడ్కోలుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరుకావడమే. ఎవరైనా ప్రముఖులు చనిపోతే వచ్చేంత మంది ఈ యాచకుడు మరణిస్తే చూసేందుకు వచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఐరాసలో మారని పాక్ తీరు- చురకలంటించిన భారత్
దాయాది పాకిస్థాన్ అదే వక్రబుద్ధి చూపిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) వేదికగా (India UNSC Pakistan) మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనిని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ (India slams pakistan).. కశ్మీర్లో ఆక్రమించుకున్న ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని పాక్‌ను(India slams Pakistan at UNSC) హెచ్చరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మార్కెట్లకు నష్టాలు- సెన్సెక్స్ 314 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్‌ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex today) 314 పాయింట్లు కోల్పోయి 60,008 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 101 పాయింట్లు దిగజారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ICC rankings t20: కోహ్లీ మళ్లీ అదే స్థానంలో.. మెరుగైన వార్నర్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం(నవంబర్ 17) టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC T20 Rankings 2021) ప్రకటించింది. ఇందులో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News) యథావిధిగా ఎనిమిదో స్థానంలో నిలవగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి 6వ ర్యాంకులో ఉన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రాధేశ్యామ్'.. రికార్డు స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్!
డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్'(prabhas radhe shyam movie release date) చిత్రబృందం మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఏ దక్షిణాది సినిమాకు సాధ్యం కాని రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ అదెంటంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.