- ఏలూరు వింత వ్యాధి ఘటనలో మూడుకు చేరిన మృతులు
ఏలూరు వింతవ్యాధి ఘటనలో మృతులు సంఖ్య మూడుకు చేరింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. బుధవారం రాత్రి సుబ్బరావమ్మ(56), చంద్రారావు(50) మరణించారు. సుబ్బరావమ్మ రెండ్రోజుల క్రితం మూర్ఛతో ఏలూరు ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడ తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ వీరంగం..
గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి హంగామా చేశారు. టోల్ కట్టకుండా వెళ్తున్న ఆమెను సిబ్బంది ఆపారు. తన కారు ఆపుతారా అంటూ బారికేడ్లు తొలగించి సిబ్బందిపై చేయిచేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ‘ఉమన్ ఇన్ నీడ్’.. మహిళల సమస్యలపై ప్రత్యేక కౌన్సెలింగ్ ఫోరం
'వివాదాలు బాగా ముదిరి నేరం జరిగిన తరువాత పోలీసు స్టేషన్లకు వస్తున్నారు.. ఫలితంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఫలితంగా ఎంతో మంది నష్టపోతున్నారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ‘విన్’ కౌన్సెలింగ్ ఫోరం పనిచేస్తుంది' అని విశాఖ నగర పోలీసు కమిషనర్ మనీశ్‌కుమార్ సిన్హా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనానా..? ఆ ఊసే లేదక్కడ!
కొద్దిరోజులుగా మానవాళి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది కరోనా. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని దేశాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో వైరస్‌ను అదుపులోకి తెచ్చాయి. అదే తరహాలో మన దేశంలోనూ ఓ దీవి నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో 98లక్షలకు చేరువలో కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కొత్తగా 31,522 కేసులు నమోదయ్యాయి. మరో 412 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏటీఎం దొంగతో సెక్యూరిటీ గార్డ్ పోరు
ఏటీఎం కేంద్రంలో చోరీకి పాల్పడేందుకు వచ్చిన ఓ దుండగుడి ప్రయత్నాన్ని భగ్నం చేశాడు సెక్యూరిటీ గార్డు. ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడుతున్నా.. అధైర్య పడకుండా దుండగుడిని నిలువరించి రాడ్డును లాక్కున్నాడు. చేసేది లేక ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పట్టువీడని రైతన్న- 15వ రోజుకు చేరిన నిరసనలు
దేశ రాజధాని దిల్లీలో రైతులు తలపెట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఈ నిరసనలు చేపట్టారు. దిల్లీ-హరియాణా సరిహద్దులోని టిక్రి వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైబర్ దాడిలో ఫైజర్ టీకా డేటా హ్యాక్!
తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ డేటా చోరీకి గురైనట్లు ఫైజర్- బయోఎన్టెక్లు ప్రకటించాయి. యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ)పై జరిగిన సైబర్ దాడిలో హ్యాకర్లు ఈ డేటాను యాక్సెస్ చేయగలిగినట్లు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోహిత్ శర్మను సమం చేసిన కెప్టెన్ కోహ్లీ
భారత్ తరఫున పోటీ పడి పరుగులు చేస్తున్న కోహ్లీ.. టీ20 ఫార్మాట్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా అయితే ఏంటి.. సెలబ్రిటీల పెళ్లికి అడ్డేంటి!
కరోనా వల్ల పలువురు సెలబ్రిటీల పెళ్లిలు ఈ ఏడాది వాయిదా పడగా.. మరికొందరు సాదాసీదాగానే జరుపుకొన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో పాటు గాయనీ గాయకులు కూడా ఉన్నారు. ఇంతకీ వారెవరు? ఎప్పుడు వివాహం చేసుకున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.