- తిరుపతికి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుపతి చేరుకున్నారు. కాసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతికి.. గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఐదో రోజుకు తుంగభద్ర పుష్కరాలు...పెద్దగా హాజరుకాని భక్తులు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు ఐదో రోజుకు చేరాయి. కొవిడ్ కారణంగా...పుష్కరస్నానం చేసేందుకు భక్తులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అదుపు తప్పి జీపు బోల్తా.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు
విశాఖ జిల్లా పనసపుట్టు సమీపంలో అదుపు తప్పి జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. బాధితులు పెదబయలు మండలం గడుగుపల్లి వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రశ్నించిన వారిని అవమానపరుస్తారా?: లోకేశ్
వైకాపా దుశ్చర్యలకు రాష్ట్రంలో రోజుకో ముస్లిం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో మరో 37,975 మందికి కరోనా
దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 37,975 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 91లక్షల 77వేల 841కి చేరింది. వైరస్ కారణంగా మరో 480 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫిబ్రవరిలో జరగనున్న జేఈఈ మెయిన్స్!
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా 2021 జనవరిలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరిలో జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది అధికార యంత్రాంగం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దారేది?
ప్రజలకు రాజకీయ చైతన్యం, విజ్ఞానం, ఇతర సేవలనందించడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకోసం సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ, పటిష్టమైన పాలన, ప్రణాళిక వ్యవస్థ సహా.. ప్రజలకు భాగస్వామ్యం కల్పించినప్పుడే సత్వర అభివృద్ధి సాధ్యమవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రముఖ ప్రవాస భారతీయ ఫిజీషియన్ లోధా మృతి
ప్రముఖ భారత అమెరికన్ వైద్యుడు అజయ్ లోధా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత ఎనిమిది నెలలుగా వైరస్‌తో పోరాడిన ఆయన.. ఈ నెల 21న ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐపీఎల్లో అదుర్స్.. మరి ఆస్ట్రేలియాలో?
పలువురు భారత క్రికెటర్లు.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో అదరగొట్టారు. మరి త్వరలో ప్రారంభం కానున్న ఆసీస్‌తో సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎమ్మీ అవార్డ్స్: ఉత్తమ డ్రామా సిరీస్‌గా 'దిల్లీ క్రైమ్'
'దిల్లీ క్రైమ్' వెబ్‌సిరీస్ ఎమ్మీ అవార్డును అందుకుంది. దిల్లీ అత్యాచార ఘటన ఆధారంగా రూపొందిన ఈ సిరీస్.. ఉత్తమ డ్రామా విభాగంలో పురస్కారానికి ఎంపికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.