ETV Bharat / city

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి... - వాతావరణ తాజా సమాచారం

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని... ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ క్రమంగా కొనసాగుతోందని వెల్లడించారు.

today weather report  of Andhra Pradesh
కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి... మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు
author img

By

Published : Oct 6, 2020, 10:47 PM IST

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా దక్షిణ తీరప్రాంతాన్ని అనుకుని ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురువనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా అక్టోబరు 9వ తేదీ నాటికి అండమాన్ తీరానికి దగ్గరగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ క్రమంగా కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని విశాఖ, విజయనగరం, దక్షిణ కోస్తాలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలోని వివధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు

  • గన్నవరం -6.1 సె.మీ
  • పొన్నూరు 3.8 సె.మీ
  • గోపాలపురం 3.6 సె.మీ
  • విజయనగరం 3.1 సె.మీ
  • విశాఖపట్నం 2.7 సె.మీ
  • భీమడోలు 2.5 సె.మీ
  • రాజమహేంద్రవరం 2.3 సె.మీ
  • కొవ్వూరు 1.8 సె.మీ
  • వీరఘట్టం 1.3 సె.మీ

ఉష్ణోగ్రతలు వివరాలు...

  • విజయవాడ 36 డిగ్రీలు
  • విశాఖపట్నం 32 డిగ్రీలు
  • తిరుపతి 34 డిగ్రీలు
  • అమరావతి 39 డిగ్రీలు
  • విజయనగరం 33 డిగ్రీలు
  • నెల్లూరు 35 డిగ్రీలు
  • గుంటూరు 39 డిగ్రీలు
  • శ్రీకాకుళం 32 డిగ్రీలు
  • కర్నూలు 33 డిగ్రీలు
  • ఒంగోలు 34 డిగ్రీలు
  • ఏలూరు 37 డిగ్రీలు
  • కడప 34 డిగ్రీలు
  • రాజమహేంద్రవరం 38 డిగ్రీలు
  • కాకినాడ 34 డిగ్రీలు
  • అనంతపురం 35 డిగ్రీలు

ఇదీ చూడండి:

'జగనన్న విద్యాకానుక'.. 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.