గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 458 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి 54 మందికి ,అనంతపురంలో 29 మందికి,కృష్ణా 78 ,గుంటూరు 41 ,కడపలో 18 మందికి, కర్నూలు 13, నెల్లూరు26, ప్రకాశం 6, శ్రీకాకుళం13, విశాఖపట్నం 28 మందికి, విజయనగరం 19 మందికి, పశ్చిమగోదావరిలో 35 మందికి సోకినట్టుగా అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 77 వేల 806కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల377గా వైద్యాధికారులు తెలిపారు. గడచిన 24 గంటల వ్యవధిలో534 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 66వేల 359 కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో గుంటూరులో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారి సంఖ్య 7,070 కి చేరింది .
గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో కొత్తగా 41 కేసులు నమోదయయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో మెుత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74 వేల 166కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 16 ఉన్నాయి. మంగళగిరి, తుళ్లూరు, రెంతచింతల, చిలకలూరిపేట, భట్టిప్రోలు, బాపట్ల రెండు కేసుల చొప్పున, తెనాలిలో 3 కేసుల చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 72 వేల 840 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 667 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 659 మంది మృతి చెందారు.