నూజివీడు పట్టణంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మహాత్మగాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జాతిపిత మహాత్మాగాంధీ అందించిన అహింసా వాదమే నేటికీ భారతీయుల ఆయుధంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి, రాజ్యసభ సభ్యుడు టి జి వెంకటేష్ కర్నూలోని కోడమూరులో యాత్ర సందర్భంగా.... ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో గాంధీ సంకల్పయాత్రలో మాజీ మంత్రి భాజపా రాష్ట్ర కార్యదర్శి పైడి కొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ... ఆ మహాత్ముని ఆశయాలను, లక్ష్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి ఈ యాత్రను కొనసాగిస్తున్నామని తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు బీపీ వెంకట ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ పతాకాలు చేతపట్టుకొని పాదయాత్ర చేశారు.
ఇవీ చదవండి
మహాత్మా గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించిన కన్నా లక్ష్మినారాయణ