ETV Bharat / city

అలాగైతే.. రాష్ట్ర ప్రజలు డీజీపీకి నోటీసులివ్వాలి: వర్ల రామయ్య - చంద్రబాబుకు డీజీపీ నోటీసులు

మాదకద్రవ్యాల కేసులో పోలీసుల దర్యాప్తునకు సంబంధించి.. రాష్ట్ర ప్రజలే డీజీపీకి నోటీసులివ్వాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మాదకద్రవ్యాల వ్యవహారంపై చంద్రబాబు, లోకేశ్​ విమర్శలు చేస్తే.. వారికి నోటీసులు ఇవ్వడమేంటని నిలదీశారు.

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

author img

By

Published : Oct 14, 2021, 4:39 PM IST

రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చారని విమర్శించినందుకు చంద్రబాబుకు, లోకేశ్​కు డీజీపీ గౌతం సవాంగ్​నోటీసులివ్వడాన్ని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చారని చేసిన విమర్శలకు రాజకీయంగా అధికార పార్టీ నేతలు స్పందించాలి కానీ పోలీసులకేం సంబంధమని నిలదీశారు. జగన్ రెడ్డికి గౌతం సవాంగ్ అధికార ప్రతినిధా? లేక వైకాపా సభ్యులా? అని ప్రశ్నించారు.

మాదకద్రవ్యాల కేసులో పోలీసుల దర్యాప్తు ఏంటని రాష్ట్ర ప్రజలే డీజీపీకి నోటీసులివ్వాలని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్ పోకడ వింతగా ఉందని ఎద్దేవ చేశారు. డ్రగ్స్ సరఫరా చేసే కింగ్ పిన్ విజయవాడలో అడ్రెస్ తో సహా ఉంటే సంబంధం లేదని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాష్ట్రానికి డ్రగ్స్ తో సంబంధం లేదంటూ డీజీపీ ఇచ్చింది అసత్య ప్రకటనే. నోటీసులు జారీచేయటం తొందరపాటు చర్యగా భావించి వాటిని వెనక్కి తీసుకోవాలి."

-వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

ఇవీ డ్రగ్స్​ మాఫియాపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు..

"రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా చెలరేగిపోతోంది. వైకాపా నేతలు డ్రగ్స్ డాన్స్‌, స్మగ్లింగ్ కింగ్‌లుగా మారారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారవుతోంది. లిక్కర్ మాఫియా డబ్బు హవాలా దారిలో విదేశాలకు వెళ్తోంది. ప్రకృతి విపత్తులకు రైతులు నష్టపోతున్నా ఆదుకునేవారు కరవయ్యారు. కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాష్ట్ర రైతులకు అందడం లేదు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 31 వరకు ఆందోళనలు చేపడతాం." - చంద్రబాబు, తెదేపా అధినేత

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్థత వల్లే..

కృష్ణ నది నిర్వహణ బోర్డులో జూరాల ప్రియదర్శినిని చేర్చకపోవటం రాయలసీమ జిల్లాలకు మరణశాసనమని తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. కేఆర్​ఎంబీలో జూరాల ప్రియదర్శిని చేర్చకపోవటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్థతే కారణమని మండిపడ్డారు. రాయలసీమకు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు. జూరాల ప్రాజక్టు నుంచి నీటిని విచ్చలవిడిగా కొల్లగొట్టటానికి తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి రాయలసీమకు అన్యాయం చేశారని ఆరోపించారు.

తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ లను చేర్చుతూ నోటిఫికేషన్ ఇప్పించినట్లు గుర్తుచేశారు.

"అసలు వెళ్లిన కార్యక్రమం ఏంటి? చేసిన భజన ఏంటి?"

తిరుమలకు సీఎం జగన్​ వెళ్లిన కార్యక్రమం ఏంటి అక్కడ ఆయనకు చేసిన భజన ఏంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

  • దేవుని నామస్మరణ చేసే కార్యక్రమంలో జగన్ భజన చేయడం ఏంటి? మీ పనికిమాలిన రాజకీయం పవిత్రమైన గుడిలో ఏంటి?అరాచక ఆటవిక పాలనకి ఇదే నిదర్శనం. భక్తుల మనోభావాలతో ఆటలు ఆడడం మంచి పద్ధతి కాదు..! @ysjagan #గోరంట్ల#FailedCMjagan pic.twitter.com/nIrrr4cKdF

    — Gorantla butchaiah choudary (@GORANTLA_BC) October 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేవుని నామస్మరణ చేసే పవిత్రమైన గుడిలో జగన్ భజన చేసే మాటలేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ముఖ్యమంత్రి తిరుమల పర్యటన సందర్భంగా తులాభారం వద్ద వైవీ సుబ్బారెడ్డి భార్య చేసిన నినాదాల వీడియోను తన ట్విట్టర్​లో పోస్టు చేశారు. అరాచక ఆటవిక పాలనకి ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఆటలు ఆడడం జగన్ రెడ్డికి మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. జరుగుతున్న జగన్నాటకంలో ప్రచారార్భాటం తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు. గుడిని గుడిలో లింగాన్ని వదలకపోవడం అంటే ఇదేనని ఎద్దేవ చేశారు.

ఇదీ చదవండి: LOKESH LETTER TO CM: జీతాలడిగితే తొలగిస్తారా.. సీఎం జగన్​కు నారా లోకేశ్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.