ETV Bharat / city

ప్రభుత్వం 60 లక్షల రేషన్ కార్డులు తొలగించబోతోంది: పట్టాభి - రేషన్ కార్డుల తొలగింపుపై పట్టాభి కామెంట్స్

ప్రభుత్వం త్వరలో 60 లక్షల రేషన్ కార్డులు తొలగించబోతోందని..తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. రుణాల సేకరణలో వెసులుబాటు కోసం పేదల లబ్ధికి కోత విధిస్తోందని విమర్శించారు. రేషన్ కార్డుల తొలగింపు ఆ కోవకే చెందుతుందన్నారు.

ప్రభుత్వం 60 లక్షల రేషన్ కార్డులు తొలగించబోతోంది

author img

By

Published : Dec 11, 2020, 3:58 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే 60 లక్షల రేషన్ కార్డులు తొలగించేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఒకే దేశం ఒకే రేషన్ విధానం అమలు కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నెలరోజుల వ్యవధిలో 9 లక్షల కార్డులు తొలగించారని ఆరోపించారు.

"జాతీయ ఆహార భద్రత వెబ్​సైట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 88,16,875. నవంబరు వరకు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు 1 కోటి 52లక్షలు. డిసెంబరులో దాదాపు 9 లక్షల కార్డులు తొలగించి రేషన్ కార్డుల సంఖ్యను 1 కోటి 44 లక్షలకు తీసుకొచ్చారు. కేంద్ర వెబ్​సైట్​లో ఉన్న లెక్క ప్రకారం 88 లక్షలకే రేషన్ కార్డులను పరిమితం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆ ప్రకారం 60 లక్షల కార్డులను తొలగిస్తే కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా ఉచిత బియ్యం అదిస్తుంది. ఈ చర్య ద్వారా 16 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన పౌరసరఫరాల కార్పొరేషన్​పై భారం తగ్గించుకోవటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3700 కోట్లు మిగలనుంది. 2 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుకోవటానికి కేంద్రం పెట్టిన షరతుల్లో రేషన్ కార్డుల తొలగింపు ఒకటి. ఇందులో భాగంగా రూ.20వేల కోట్ల అప్పు తెచ్చుకునేందుకు విద్యుత్ సంస్కరణలు, రేషన్ తొలగింపు, ఆస్తిపన్ను షరతులకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయించుకునే వరకూ మాయమాటలు చెప్పి ఆ తర్వాత 60లక్షల కార్డులు తొలగించనున్నారు." -కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి

ఇప్పటికే 1,120కోట్ల భారం

ఏడాదిన్నరలో రేషన్ సరుకుల ధరల పెంపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ.1,120 కోట్ల భారం మోపిందని పట్టాభి విమర్శించారు. తెదేపా హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా తొలగించకుండా 9 రకాల సరుకులు అందజేశామన్నారు. వైకాపా ప్రభుత్వం 9 లక్షల రేషన్ కార్డులు తొలగించి బియ్యం ద్వారానే మరో రూ.540 కోట్లు ప్రజలకు ఎగ్గొట్టిందన్నారు. మంత్రి కొడాలి నాని ఒక్క సమీక్ష కూడా చేయకుండా నాకెంత-నీకెంత అనే రీతిలో వ్యవహరిస్తున్నారని పట్టాభి ఆరోపించారు.

ఇదీచదవండి

'జగన్ అండతో వైకాపా ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.