విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా నూతన టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేశారు. పౌర విమానయాన శాఖ బోర్డు సభ్యుడు కాశం వెంకటేశ్వర్లు ఈ భవన నమూనా ఏర్పాట్లను పరిశీలించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ సంకల్పించారని వెంకటేశ్వర్లు తెలిపారు.
నూతన టెర్మినల్‌కు సంబంధించిన నమూనా వీడియోను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రీయ సంస్కృతికి తగిన విధంగా టెర్మినల్ నమూనా భవనాన్ని రూపొందించడం పట్ల వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం విమానాశ్రయం అభివృద్ధి, ఇతర అంశాలను డైరెక్టర్ మధుసూదనరావు బృందం ఆయనకు వివరించారు.
ఇదీ చదవండీ.. శ్రీవారికి పోస్కో సీఈవో 10 కోట్ల విరాళం