విజయవాడ అజిత్‌సింగ్ నగర్ వాంబేకాలనీకి వెళ్ళే రహదారీలో.. దాలిపర్తి రాంబాబు అనే ఆర్ఎంపీ వైద్యుడు నివాసం ఉంటున్నారు. కరోనా వేళ విధించిన లాక్‌డౌన్‌తో అందరిలానే అతనూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఖాళీ సమయంలోనే, పెరటి సాగును ప్రారంభించాడు. దానికి ఇంటి మేడపైన ఉన్న ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. అప్పటికే ఉన్న పద్ధతులను అన్వేషించారు. వివిధ రకాల కూరగాయలు, పళ్ళు, ఆకుకూర మెక్కలని క్రమపద్ధతిలో పెంచారు.
ఇంట్లో ఖాళీగా ఉన్న భార్య, పిల్లలు కూడా చేయి కలిపారు. ఇప్పుడు పలు రకాల కూరగాయలతో పాటు....అనేక ఫలాల మొక్కలను సైతం రాంబాబు కుటుంబం పెంచుతున్నారు. రసాయనాలు వాడకుండా కేవలం కంపోస్టు ఎరువుతోనే పెరట్లోని మొక్కలను పెంచుతున్నానంటున్న రాంబాబు... స్వయం ఫలసాయంతో పాటు మెక్కలపై ఉన్న మమకారం కూడా తీరుతోందని చెబుతున్నారు. భార్యతో పాటు పిల్లలూ తమవంతు సహకారం అందిస్తున్నారని అంటున్నారు.
పండించిన కూరగాయలు, ఫలాలను తమతో పాటు తమ స్నేహితులకు కూడా పంచుతున్నామంటున్న రాంబాబు....కరోనా వేళ ఆరోగ్యానికి మరింత ఉపకరిస్తుందని చెబుతున్నాడు.
ఇదీ చదవండి: అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు