వర్షాలు తగ్గే వరకు విజయవాడ దుర్గగుడి ఘాట్రోడ్డులోకి ఎవరిని అనుమతించమని ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు స్పష్టంచేశారు. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన... అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంజినీర్లతో చర్చించారు. వర్షం తగ్గిన తర్వాత ఘటనస్థలంలో పూర్తిస్థాయిలో ఇనుపకంచెను నిర్మిస్తామని తెలిపారు. దసరా ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీచదవండి