ETV Bharat / city

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెగని పంచాయితీ - ఏపీ తెలంగాణ ఆర్టీసీ అధికారుల సమావేశం న్యూస్

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెగని పంచాయితీ

author img

By

Published : Oct 7, 2020, 3:19 PM IST

Updated : Oct 7, 2020, 7:48 PM IST

15:18 October 07

అంతర్రాష్ట్ర బస్‌ సర్వీసుల ఒప్పందం తేలకుండానే ముగిసిన భేటీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర బస్‌ సర్వీసుల ఒప్పంద సమావేశం.. ఎటూ తేలకుండానే ముగిసింది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7గంటల 15 నిమిషాల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఇరు రాష్ట్రాల ఈడీలు బస్‌ సర్వీసులు తిరిగే కిలోమీటర్లపై చర్చలు జరిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈడీలు 2లక్షల కిలోమీటర్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అధికారులకు ప్రతిపాదనలను చేశారు.  

ఏపీ, తెలంగాణ సర్వీసులు ఒక లక్షా 61వేల కిలోమీటర్లు సమాన ప్రాతిపదికన తిప్పాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు. అయితే ఏపీ - తెలంగాణ ఈడీలు తమ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత మరోసారి సమావేశం అవుతామని అంగీకారానికి వచ్చారు.

ఇదీ చదవండి: 

రాజధాని అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు

Last Updated : Oct 7, 2020, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.