రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి నిపుణులతో కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరారు. కరోనా వైరస్ విదేశాల నుంచి భారత్ వచ్చినందున, రాష్ట్రంలోకి విదేశాల నుంచి వచ్చేవారికి తనిఖీలు చేయడమే కాకుండా వెంటనే ఆస్పత్రికి తరలించాలన్నారు. రాష్ట్రంలో 9,600 పంచాయతీలు ఉండగా... ఎక్కువ చోట్ల పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు ఎలా తగ్గుతాయని అయ్యన్న ప్రశ్నించారు.
ఇవీ చదవండి: