ETV Bharat / city

STUDENT SUICIDE: బాలిక ఆత్మహత్య కేసు వ్యవహారంలో ఆ పార్టీ నేత సస్పెండ్.. ముమ్మరంగా విచారణ - vijayawada crime news

STUDENT SUICIDE: విజయవాడలోని భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో తెదేపాకు చెందిన వినోద్ జైన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ వినోద్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించింది.

ఆత్మహత్య చేసుకున్న బాలికకు న్యాయం చేయాలని తెదేపా డిమాండ్‌

author img

By

Published : Jan 30, 2022, 3:24 PM IST

Updated : Jan 30, 2022, 5:01 PM IST

ఆత్మహత్య చేసుకున్న బాలికకు న్యాయం చేయాలని తెదేపా డిమాండ్‌

STUDENT SUICIDE: విజయవాడలోని భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలికకు న్యాయం చేయాలని. తెదేపా మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన నేతలు.. ఈ ఘటనపై మండిపడ్డారు. ఆపార్ట్‌మెంట్‌లో ఉండే వ్యక్తి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని, దీనికి కారణమైన వ్యక్తిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు: ఏసీపీ

కుమ్మరి పాలెం బాలిక ఆత్మహత్య కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదో తరగతి బాలిక రెండున్నర నెలలుగా వినోద్ అనే వ్యక్తి నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు సూసైడ్ నోట్​లో మృతిచెందిన బాలిక తెలిపిందని ఆయన వివరించారు. సీసీ టీవీ ఫుటేజ్ సూసైడ్ నోట్ లోని వివరాలు పరిశీలించి విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలిక నివాసముంటున్న అపార్ట్ మెంట్ లోనే పై అంతస్తులో వినోద్ ఉంటారని ఏసీపీ తెలిపారు. ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

తెదేపా నుంచి వినోద్ జైన్ సస్పెండ్..

విజయవాడ చెందిన వినోద్‌ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెదేపా ప్రకటించింది. అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో చర్యలు చేపట్టినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. బెజవాడలో సంచలనం రేకెత్తించిన బాలిక ఆత్మహత్య కేసులో వినోద్ జైన్ నిందితుడిగా ఉండడంతో.. తెలుగుదేశం పార్టీ ఈ మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండి:

'అమరుల కుటుంబీకులు భావోద్వేగానికి గురైన క్షణం అది'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 30, 2022, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.