తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా గెలిస్తే ప్రస్తుతం ఉన్న 22 మంది ఎంపీలకు అదనంగా మరో ఎంపీ జతవటం తప్ప రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. లోక్ సభలో తెదేపా నుంచి ముగ్గురు ఎంపీలే ఉన్నప్పటికీ రాష్ట్ర గొంతుకగా వారు చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. పనబాక లక్ష్మిని గెలిపిస్తే రాష్ట్ర హక్కుల కోసం తాము చేస్తున్న పోరాటానికి మరింత బలం చేకూరుతుందని వివరించారు.
ఇదీ చదవండి: లోపాయికారీ ఒప్పందంతోనే జేపీ వెంచర్స్‌కు ఇసుక టెండర్లు: తెదేపా