ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా సాధన దీక్ష.. కొవిడ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ - కొవిడ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్

కొవిడ్​తో మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా.. తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ దీక్షలు నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన దీక్షలో పలువురు పార్టీ నాయకులు మాట్లాడారు.

tdp sadhana deeksha
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సాధన దీక్ష
author img

By

Published : Jun 29, 2021, 7:45 PM IST

కరోనాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 'సాధన దీక్ష' చేపట్టారు. పార్టీ ఆధినేత పిలుపు మేరకు తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సాధన దీక్ష పేరుతో నిరసన వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాలో..

కరోనా కట్టడి, వైరస్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు సాధన దీక్షకు మద్దతుగా. అవనిగడ్డలో పార్టీ శ్రేణులతో కలిసి సంఘీభావ దీక్ష చేపట్టారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు, చిరు వ్యాపారులు, కూలీలను ఆదుకోవాలని కోరారు.
'వైఎస్​ఆర్​సీపీ అంటే.. యువత, శ్రామికులు, రైతులను మోసం చేసే కరప్షన్ పార్టీ' అని తెదేపా కార్పొరేటర్ కేశినేని శ్వేత మండిపడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ కేశినేని భవన్​లో సాధన దీక్ష చేపట్టారు. 'కొవిడ్​తో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క పన్నులు పెంచిన దుర్మార్గపు ప్రభుత్వం. నిరుద్యోగ యువతను జాబ్ క్యాలెండర్ పేరిట మోసం చేసిన ప్రభుత్వం, రైతులను ధాన్యం కొనుగోలు పేరుతో.. నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం.. వైకాపా ప్రభుత్వం' అని కేశినేని శ్వేతా ఆరోపించారు.

కర్నూలు జిల్లాలో..

నంద్యాల తెదేపా కార్యాలయంలో సాధన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. కొవిడ్ లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారిని గుర్తించి న్యాయం చేయాలన్నారు. దీక్షలో భూమా బ్రహ్మానందరెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..

ప్రజలకు కరోనా పరిహారం అందకపోతే ఉద్యమం తప్పదని ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ హెచ్చరించారు. కొవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఇచ్చాపురం బస్టాండ్ వద్ద సాధన దీక్ష చేపట్టారు.

కొవిడ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ తెదేపా శ్రేణులు కాశీబుగ్గలో సాధన దీక్ష నిర్వహించారు. దీక్షలో పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, నాయకులు పాల్గొన్నారు.

కరోనా బాధితులను అదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి విమర్శించారు. సాధన దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం తెదేపా కార్యాలయంలో దీక్ష నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి తక్షణమే రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు సాధన దీక్షకు మద్దతుగా.. పాలకొండ పట్టణంలో పార్టీ నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు. కొవిడ్ బాధితులను ఆదుకోవాలని, లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారికి పరిహారం అందించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరివేన అప్పలనాయుడు డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లాలో..

తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.10 వేల పరిహారం ఇవ్వాలని తెదేపా నాయకులు మన్నే రవీంద్ర డిమాండ్ చేశారు. చంద్రబాబు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా యర్రగొండపాలెంలో సాధన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్​తో ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పత్తిపాడు నియోజకవర్గం తెదేపా ఇన్​ఛార్జ్​ వరుపుల రాజా, కాకినాడ పార్లమెంట్ తెదేపా ఇన్​ఛార్జ్​ జ్యోతుల నవీన్​ పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ రెడ్డి అనంత కుమారి డిమాండ్ చేశారు. అధినేత పిలుపు మేరకు లంకల గన్నవరంలో చేపట్టిన సాధన దీక్షలో ఆమె పాల్గొన్నారు. 2 రోజుల క్రితం లంకలగన్నవరం వద్ద గోదావరి నదిలో పడి మృతిచెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ... నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

విశాఖలో..

రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. పార్టీ అధినేత చేపట్టిన సాధన దీక్షకు సంఘీభావంగా భీమునిపట్నంలో ధీక్ష చేపట్టారు. 'సాధన దీక్షకు మద్దతు ఇద్దాం.. కరోనా బాధితులకు పరిహారం సాధిద్దాం' అని నినాదించారు. లాక్​డౌన్​తో జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, పేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

అనకాపల్లి పట్టణ పోలీసులు వైకాపా నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెదేపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు పేర్కొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా అనకాపల్లిలో దీక్షకు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోవడం పట్ల మండిపడ్డారు. టెంట్ తొలగించడంతో పార్టీ నాయకులంతా గొడుగులు వేసుకొని దీక్షలో కూర్చున్నారు. కరోనా బాధితులు, వారి కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేశారు.

నెల్లూరులో..

ఆనందయ్య మందుకు కావల్సిన ముడిసరుకును ప్రభుత్వమే అందించి రాష్ట్ర ప్రజలందరికీ మందు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే పాశం.సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సాధన దీక్షకు మద్దతుగా గూడూరులోని పార్టీ కార్యాలయంలో సంఘీభావ దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సాధన దీక్షకు సంఘీభావంగా ఉదయగిరిలో తెదేపా నాయకులు దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా మానుకోవాలని.. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరోనాతో వేలాది మంది మృతిచెందారని తెదేపా నేతలు విమర్శించారు. పార్టీ అధినేత పిలుపు మేరకు నెల్లూరు తెదేపా కార్యాలయంలో సాధన దీక్ష చేపట్టారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్షలు, లాక్ డౌన్​తో ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న పేదలకు రూ. 10వేల సాయం అందజేయాలన్నారు. దీక్షలో నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా..

పార్టీ అధినేత పిలుపు మేరకు కళ్యాణదుర్గంలో తెదేపా శ్రేణులు సంఘీభావ సాధన దీక్ష చేపట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీ ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యక్తరలు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా..

కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్​తో చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా ఏలూరులో పార్టీ నాయకులు సంఘీభావ దీక్ష నిర్వహించారు. కొవిడ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. రైతులకు రావాల్సిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.

కడప జిల్లా..

2024లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అన్నారు. చంద్రబాబు సాధన దీక్షకు మద్దతుగా రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కొవిడ్ సమయంలో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు అండగా ఉంటే.. మన సీఎం జగన్ మాత్రం ప్రజల పట్ల నిర్లక్ష్యం చేశారని మండిప్డడారు. ఇకనైనా మేలుకొని బాధిత కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా

రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లిలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో సాధన దీక్ష నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ టీచర్లు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కరోనాతో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఆక్సిజన్ అందక మరణించిన వారికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.

ప్రకాశం జిల్లా..

కొవిడ్​తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కొండిపి ఎమ్మెల్యే డీవీఎస్​బీ స్వామి అన్నారు. చంద్రబాబు సాధన దీక్షకు మద్దతుగా స్థానిక పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. కొవిడ్ మృతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధిలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

కరోనా బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. చంద్రబాబు పిలుపు మేరకు అద్దంకి పార్టీ కార్యాలయంలో సాధన దీక్ష నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు తక్షణమే రూ. 10 వేల ఆర్థిక సాయం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా

అధినేత చంద్రబాబు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా విజయనగరంలో తెలుగు యువత సాధన దీక్ష నిర్వహించారు. 'కరోనా కారణంగా పేదల బతుకులు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. చాలా కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి' అని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు.

సాలూరు నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ ఆర్​పీ బంజాదేవ్ ఆధ్వర్యంలో సాధన దీక్ష చేపట్టారు. కరోనా బాధితులు, మృతులు, ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరికి సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..: DISHA APP: 'దిశ' యాప్ ఉంటే..అన్నయ్య తోడున్నట్లే: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.