రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ .. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేపట్టింది. విజయవాడ భవానీపురంలో ఆ పార్టీ శ్రేణులు పెట్రోల్ బంకుల ముందు ధర్నా నిర్వహించారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఉన్నాయని తెదేపా నేతలు మండిపడ్డారు. వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.
కర్నూలులోని గాయిత్రీ ఎస్టేట్ నుంచి మెడికల్ కళాశాల పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ చేపట్టారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని..నేతలు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేతృత్వంలో తెలుగుదేశం శ్రేణులు ధర్నా నిర్వహించారు.
ఇదీ చదవండి:
Maha Padayathra: తొమ్మిదో రోజు మహాపాదయాత్ర.. ఇంకొల్లు నుంచి ప్రారంభం