ETV Bharat / city

MLC Ashok babu: ఉద్యోగుల ‎సమస్యలపై ‎గవర్నర్ జోక్యం చేసుకోవాలి: ఎమ్మెల్సీ అశోక్ బాబు - తెదేపా ఎమెల్సీ అశోక్ బాబు న్యూస్

MLC Ashok babu: ఉద్యోగుల నిరసన పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా నేత అశోక్ బాబు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం లేదని విమర్శించారు. ఈ సమస్యపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని అశోక్ బాబు కోరారు.

ఉద్యోగుల ‎సమస్యలపై ‎గవర్నర్ జోక్యం చేసుకోవాలి

author img

By

Published : Feb 4, 2022, 4:37 PM IST

MLC Ashok babu On Employees Protest: ఉద్యోగుల ‎సమస్యలపై ‎గవర్నర్ జోక్యం చేసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు కోరారు. ఉద్యోగుల సమస్యలపై సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం అని నిలదీశారు. ప్రభుత్వం బడ్జెట్ అంతా ఉద్యోగుల జీతాలకే ఇస్తున్నట్టు చిత్రీకరిస్తున్నా.., ప్రజలు నమ్మటం లేదన్నారు. నిన్న జరిగిన ఉద్యమంలో పోలీసులను తప్పు పట్టడం సరికాదన్నారు. పోలీసులు మాత్రం ఉద్యోగులు కాదా ? వారికి జీతాలు తగ్గిస్తే ‎ప్రభుత్వానికి ఎందుకు సహకరిస్తారని ప్రశ్నించారు.

రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయాం..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు పీఆర్సీల కాలాన్ని కోల్పోయారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీ నేతల స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం విలేకర్లతో నేతలు మాట్లాడారు. వేతన సవరణ తేదీకి అమలు తేదీకి ప్రభుత్వాలు వ్యత్యాసం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ఎప్పుడూ మధ్యంతర భృతి వెనక్కి తీసుకోలేదని సూర్యనారాయణ గుర్తు చేశారు. మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పు అని మాకు తెలియదని చెప్పారు. మధ్యంతర ఉపశమనం ఏ రకంగా రుణంగా కనిపించిందో అధికారులు చెప్పాలని పేర్కొన్నారు. ఐఏఎస్‌లా గొప్ప చదువులు చదవకపోయినా ఇది సాధారణ లెక్కలేనని ప్రతి ఉద్యోగికీ తెలుసునన్నారు. ఐఆర్‌ జీవోలో ఒక తరహాగా గత పీఆర్సీలో ఒకలా ఉండటం తప్పుదోవ పట్టించడమే అవుతుందని చెప్పారు. జీవోను నిలుపుదల చేయాలని చెప్పినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని తెలిపారు.అవగాహనరాహిత్యం ఎవరిదో ప్రభుత్వమే అర్థం చేసుకోవాలని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. కేంద్ర పే కమిషన్‌కు వెళ్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

సమస్యను జఠిలం చేస్తున్నారు..

రాజకీయ ప్రసంగాలు చేస్తూ సమస్యను ప్రభుత్వం జఠిలం చేస్తుందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలు ఉద్యోగులకు అక్కర్లేదన్నారు. ఉద్యోగులకు మాత్రం సమస్యల పరిష్కారమే కావాలని స్పష్టం చేశారు.

"సమ్మె చేస్తే ఉద్యోగులకు జీతాలు వస్తాయా ? రావు కదా.? ప్రభుత్వానికి అన్ని రకాలుగా చెప్పి చూశాకే సమ్మెకు వెళ్తున్నాం. ఉద్యోగులు చర్చలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగులను పిలవకుండానే చర్చలకు పిలిచినట్లు చెప్పవద్దు. పీఆర్సీ నివేదికను బయటపెట్టడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. పాత స్కేల్‌ ప్రకారం డీఏ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదా? డీఏలతో సంబంధం లేకుండా పీఆర్సీని పరిగణనలోకి తీసుకోవాలి. డీఏలు లేకుండా కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతం తగ్గుతుంది. హెచ్‌ఆర్‌ఏ మారిన చోట మాత్రం కొంతమేర జీతం పెరిగింది"- బొప్పరాజు వెంటకేశ్వర్లు, పీఆర్సీ సాధన సమితి నేత

మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్‌లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని మరో నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీకి డీఏకి ఏదన్నా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికి కేంద్రం ఆదేశాల మేరకు చెల్లింపు ఉంటుందన్నారు. సీఎం చుట్టూ ఉన్న సలహాదారులకు లెక్కలు తెలీదని, ఉద్యోగులకు మాత్రమే వారి వేతన వివరాలు తెలుస్తాయని చెప్పారు.

ఇదీ చదవండి

ap employees steering committee: 'సమ్మెలోకి వెళ్తే జీతాలు మిగిల్చుకుందామని ప్రభుత్వం కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.