అసెంబ్లీలో వరుసగా ఏడో రోజూ.. తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రికి అనుకూలంగా అధికార పార్టీ సభ్యులు వాయించిన చిడతలను అడ్డుకున్నందుకే.. తమను రెండురోజులపాటు సస్పెండ్ చేశారని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్రజల ప్రాణాలకంటే.. సీఎంను పొగుడుకునేందుకే సభలో ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే.. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. కల్తీసారా మరణాలకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏముందని ప్రశ్నించారు. మార్షల్స్‌ను అడ్డంపెట్టుకుని సభను నడిపే ఏకైక స్పీకర్ తమ్మినేని మాత్రమేనని అన్నారు.
ఇదీ చదవండి: ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద.. తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు!