దేశ సారభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా వైకాపా ప్రవర్తించిందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఫేక్ ఐడీల వెనక దోషులు ఎవరున్నా కఠినంగా శిక్షించాలన్నారు. దొంగల పార్టీ.. దొంగ ఓట్లకు పాల్పడి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిందని ఆయన ఆరోపించారు. దొంగ ఓటర్లను పోలీసులు దగ్గరుండి రక్షిస్తున్నారని విమర్శించారు. తక్షణమే సీఈసీ జోక్యం చేసుకుని రీ పోలింగ్ నిర్వహించాలని అనగాని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించండి: వెంకట్రామిరెడ్డి