తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడు మొదలుకానుంది. పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్.. ఎన్టీఆర్ భవన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి ఆన్లైన్లో సభ్యత్వం తీసుకునే విధానాన్ని తెలుగుదేశం అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ల ద్వారా సభ్యత్వం పొందే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే సభ్యత్వం ఉన్నవారు పునరుద్ధరించుకోవచ్చు.
9858175175 నెంబర్కు వాట్సప్ నుంచి హాయ్ అని సందేశం పంపిస్తే.. నమోదు ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లోనూ సభ్యత్వ నమోదు, లేదా పునరుద్ధరణ చేసుకోవచ్చని తెలుగుదేశం నాయకులు తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటాం: చంద్రబాబు