రైతు సమస్యలపై కృష్ణా జిల్లా తెలుగుదేశం నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సూరిబాబు పార్క్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు.. ప్రదర్శన సాగింది. పెనుగంచిప్రోలులో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు.. ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి.. వినతిపత్రం అందజేశారు. రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. రైతు సమస్యలపై.. తెదేపా పిలుపు మేరకు పెనమలూరులో పాదయాత్ర నిర్వహించారు. రైతులకు.. పంట బకాయిలు వెంటనే చెల్లించాలని, వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగించడం ఆపేయాలని తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ డిమాండ్ చేశారు. గన్నవరంలో పార్టీ ఆఫీస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను జగన్ సర్కార్ నిలువు దోపిడీ చేస్తోందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. అవనిగడ్డలో రైతు సమస్యలపై గాంధీ క్షేత్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎడ్లబండిపై ర్యాలీ చేశారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని నేతలు విమర్శించారు. దివిసీమలో చివరి భూములకు సాగు నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్ నేత మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ విమర్శించారు.
పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక గాంధీ క్షేత్రం నుంచి అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం వరకు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. రైతు ఆత్మహత్యలలో భారతదేశంలోనే రెండో స్థానంలో రాష్ట్రం నిలిచిందని దివిసీమలోని కోడూరు, నాగాయలంక మండలంలో చివరి భూములకు సాగు నీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులకు వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించి రైతుకు గుదిబండగా తయారయ్యారని.. రైతును ఏ విధంగానూ ఆదుకోకుండా అసమర్థ ప్రభుత్వం తయారయిందని ఆరోపించారు. గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పారు. ఇదేవిధంగా కొన సాగితే రాబోయే రెండేళ్లలో రైతాంగం వ్యవసాయానికి దూరం అవుతుందన్నారు.
ఇదీ చదవండి: