ETV Bharat / city

TDP: వివేకాను ఎవరు చంపారో సీఎంకు తెలుసు.. కావాలనే మౌనం - విజయవాడ వార్తలు

వివేకా హత్య కేసులో సంచలన విషయాలు బయటకు రావడంతో తెదేపా నేతలు(TDP Leaders on YS Viveka murde) సీఎం జగన్​పై ప్రశ్నల వర్షం కురిపించారు. హంతకుల గురించి ముఖ్యమంత్రికి ముందుగానే తెలుసని వారు అన్నారు.

TDP Leaders on YS Viveka murde
TDP Leaders on YS Viveka murde
author img

By

Published : Nov 14, 2021, 3:29 PM IST

Updated : Nov 14, 2021, 7:27 PM IST

మాట్లాడుతున్న తెదేపా నేతలు

వివేకాను ఎవరు చంపారనేది సీఎం జగన్‌కు మొత్తం తెలుసునని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. హంతకులెవరో తెలిసికూడా.. కావాలనే రెండున్నరేళ్ల నుంచి మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా హంతకులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

40 కోట్ల రూపాయలకు.. బాబాయ్‌కి గొడ్డలి పోటుపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. నవరత్నాలతో ప్రజలకి పన్ను పోటు పొడిచారని.. మొత్తానికి ఏపీకి వెన్నుపోటు పొడిచారని గోరంట్ల విమర్శించారు. నారాసుర రక్త చరిత్ర అని సొంత పేపర్‌లో రాసిన వారు ఇప్పుడేం రాస్తారని నిలదీశారు.

దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో.. ఆనాడే సీఎం జగన్‌కు తెలసని.. తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అన్ని తెలిసే... సీబీఐ విచారణ అంటూ.. జగన్‌ మోహన్‌రెడ్డి నాటకాలు ఆడారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో సీబీఐ విచారణ అడిగిన జగన్‌.. ముఖ్యమంత్రి అయ్యాక హైకోర్టులో వేసిన కేసును ఎందుకు వెనక్కి తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యిందన్నారు. తన రాజకీయాలకు రక్తచరిత్రను వాడుకున్నారని ధ్వజమెత్తారు.

హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని మాజీ మంత్రి అయన్నపాత్రుడు అన్నారు. జగన్ అండ్ విజయసాయిరెడ్డి కిల్డ్ వివేకా అని తేలిందని ధ్వజమెత్తారు. బాబాయ్​పై జగన్ రెడ్డి గొడ్డలిపోటుని గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ విజయసాయిరెడ్డి అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. త్వరలో.. అప్రూవర్​గా మారి వైకాపాని రెండుగా చీల్చి సీఎం అవ్వాలనే విజయసాయి ప్లాన్ 'ఏ' తాడేపల్లిలో లీక్ అయ్యిందని వార్తలు వస్తున్నాయని అన్నారు.

  • హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా అని తేలిపోయింది విజయసాయిరెడ్డి. బాబాయ్ పై జగన్ రెడ్డి గొడ్డలిపోటుని గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. త్వరలో అప్రూవర్ గా మారి వైసీపీని రెండుగా చీల్చి (1/2) pic.twitter.com/Nk0ymrsz0k

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) November 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డికి ఉత్తమ నటుడిగా వైఎస్సార్ పురస్కారం ఇవ్వాల్సిందేనని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. పెదనాన్న వివేకా హత్యకు ప్రణాళిక సిద్ధం చేసిన అవినాష్ రెడ్డే అనుమానాలు ఉన్నాయిని.. కుట్ర జరిగిందంటూ గతంలో అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయామంటూ మొసలి కన్నీరు కార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా దాని వెనుక ఉండేది కేవలం వైఎస్సాసుర రక్త చరిత్రని మరోసారి తేలిపోయిందన్నారు.

ఇదీ చదవండి: Vice president: అదే అసలైన మతం : వెంకయ్యనాయుడు

Last Updated : Nov 14, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.