ETV Bharat / city

TDP Fire On YCP:సవాంగ్ డీజీపీ కాదు.. 'డీజేపీ'.. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది: తెదేపా

వైకాపా ప్రభుత్వం అధికార బలంతో అరాచకం సృష్టిస్తూ.. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని తెదేపా నేతలు మండిపడ్డారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని.. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా బెదిరింపులకు తెదేపా సైనికులు భయపడరని.. ప్రజలు చైతన్యవంతులై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
author img

By

Published : Oct 22, 2021, 5:04 PM IST

వైకాపాకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలుగు మాహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితా మండిపడ్డారు. ఇక, పోలీసుల వ్యవహార శైలిపై ధ్వజమెత్తిన ఆమె.. డీజీపీపై తీవ్రంగా స్పందించారు. గౌతమ్ సవాంగ్ డీజీపీ(DGP) కాదని.. డైరెక్ట్ జగన్ పాలేరు (DJP)అని ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్​ చెప్పినట్లు వైకాపా కార్యకర్తలకు వచ్చింది బీపీ (BP) కాదని.. జగన్ ప్రెషర్ (JP) అని దుయ్యబట్టారు. జగన్ ఒత్తిడితోనే అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారన్నారు. త్వరలోనే గాజుల చేతులకు ఉన్న పవర్ ఏంటో చూపిస్తామని వైకాపా నాయకులను హెచ్చరించారు. సిల్వర్ స్క్రీన్ మీద నుంచి అప్పుడప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీదకు వచ్చి నోటికొచ్చిన్నట్లు వాగి వెళతారని వైకాపా ఎమ్మెలే రోజాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

డ్రగ్ మాఫియాలో ఆరితేరారు..
జగన్ రెడ్డి గ్యాంగ్ డ్రగ్ మాఫియాలో ఆరితేరారని తెదేపా నేత జీ.వీ.ఆంజనేయులు ఆరోపించారు. సీబీఐ కేసులు, డ్రగ్ కేసులతో సీఎం జగన్ నిరాశకు గురవుతున్నారన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందన్న విషయం సీఎం సొంత సర్వేలో వెల్లడవటంతో జగన్ ఆందోళనకు గురవుతున్నారన్నారు. జగన్​కు సొంత పార్టీలోనే వ్యతిరేకత మెుదలైందన్నారు. జగన్​ను పట్టాభి తిట్టలేదన్న జీవీ..అనని మాటలు అన్నట్లు చూపించి సానుభూతి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలకు,దాడులకు సీఎం ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

అధికార బలంతో అరాచకం..
వైకాపా ప్రభుత్వం అధికార బలంతో అరాచకం సృష్టిస్తూ..,ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అరాచకాన్ని ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఆయన ధ్వజమెత్తారు. పోలీసు అమరవీరుల సంస్మరణ సభను రాజకీయ వేదికగా మార్చారని ధూళిపాళ్ల విమర్శించారు. అభిమానులకు బీపీ వచ్చి దాడి చేశారన్న ముఖ్యమంత్రి మాటలు..రాజ్యాంగ ఉల్లంఘన కాదా ? అని నిలదీశారు. వైకాపా బెదిరింపులకు తెదేపా సైనికులు భయపడరని తేల్చి చెప్పారు. ప్రజలు చైతన్యవంతులై తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి అదే ఫ్యాక్షన్​కు బలవుతారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ హెచ్ఛరించారు. తెదేపా కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ గుంటూరులో జరిగిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

మంత్రి పదవి కాపాడుకోవటం కోసమే..
మద్యం షాపుల దగ్గరకు వైకాపా నేతలు వెళితే.. సీఎం జగన్​ను ఏ స్థాయిలో బూతులు తిడుతున్నారో అర్థమవుతుందని తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. మంత్రి పదవి కాపాడుకోవటం కోసమే కొడాలి నాని.. చంద్రబాబు, లోకేశ్ గురించి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉప్పు, కారం తామూ తింటున్నామని.. తమకూ బీపీ వస్తుందంటూ చింతమనేని ధ్వజమెత్తారు.

తెదేపాపై కక్ష సాధింపులు..
తితిదే సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించటం సరికాదని తెదేపా నేత నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. వైకాపా నాయకులు బూతులు మాట్లాడుతూ ప్రతిపక్ష తెదేపాపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. రానున్న రోజుల్లో వైకాపాకు పుట్టగతులుండవని..ఇంతకు పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

రాజకీయాల్లో ఇదేం సంస్కృతి..
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై తెదేపా నేతలు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి, నల్లారి కిషోర్​ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాయలసీమలో జరిగే ఖూనీల్లో భాగంగానే సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య జరిగిందా ? అని వారు ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణకు వేళైంది కాబట్టే వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్, పెద్జిరెడ్డి మీద కామెంట్లు చేస్తే బాంబులేస్తామని వైకాపా నేతలు మాట్లాడటం ఆక్షేపణీయమన్నారు. రాజకీయాల్లో ఇదేం సంస్కృతని వారు నిలదీశారు.

అరాచకం రాజ్యమేలుతోంది..
ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల వైకాపా పాలనలో ప్రజలకు మిగిలింది పన్నుల భారమేనని అన్నారు. పతనమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. సవాంగ్ డీజీపీ పదవికి రాజీనామా చేసి వైకాపా కండువా కప్పుకుంటే మంచిదని హితవు పలికారు.

దాడి పరికిపంద చర్య..
తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా దాడి పిరికిపంద చర్య అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దాడి చేయడం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకు ప్రజాదరణ చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకుపుడుతోందని దుయ్యబట్టారు. దాడిపై ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీని డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. వైకాపా సంగతి ప్రజాక్షత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు. 36 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డికి, చంద్రబాబుకు పోలిక లేదని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ విమర్శించారు. జగన్​కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని ధ్వజమెత్తారు. వైకాపా నేతలు చంద్రబాబు వయస్సును కూడా గౌరవించటం లేదని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా సర్కారు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా..తెదేపా శ్రేణులు భయపడవని స్పష్టం చేశారు.

క్షీణించిన శాంతిభద్రతలు..
ఆంధ్రప్రదేశ్​లో శాంతిభద్రతలు క్షీణించాయని తెలంగాణ తెలుగుదేశం నేత నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు. ఏపీలో వేల కోట్ల మాదక ద్రవ్యాల మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు. వైకాపా మంత్రులు చంద్రబాబుపై వాడిన భాష శాస్త్రీయ సంగీతమా ? అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ బద్ద పరిపాలన కొనసాగించడానికే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాదులతో ఆంధ్రప్రదేశ్​లో పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్​ భవన్​కు పోటెత్తిన శ్రేణులు ..
ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట చంద్రబాబు తలపెట్టిన 36 గంటల దీక్షకు భారీ స్పందన వస్తోంది. ఎన్టీఆర్ భవన్​కు పార్టీ శ్రేణులు పోటెత్తుతున్నారు. కార్యకర్తల తాకిడితో ఎన్టీఆర్ భవన్ కిక్కిరిసిపోయింది. వివిధ జిల్లాల నుంచి భారీ ర్యాలీలతో తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో 300 కార్లతో కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబుకి సంఘీభావం తెలిపారు. హిందూపురం నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంగళగిరి నుంచి కూడా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పరిటాల సునీత, రామ్మోహన్ నాయుడు, కూన రవి, నన్నూరి నర్శిరెడ్డిలు తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపారు. కార్యాలయం ముందున్న సర్వీస్ రోడ్ జనంతో కిక్కిరిసిపోయింది. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మూడు ఫ్లోర్లు కిటకిటలాడుతున్నాయి. జై తెలుగుదేశం నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగుతుంది. ఈ ఒక్క రోజులోనే సుమారు 30-35 వేల మంది వచ్చారని శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

TDP Leaders On Jagan : ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. తెదేపా నేతల ఆగ్రహం

chandrababu 36-hours deeksha : పోటెత్తుతున్న దీక్షాస్థలి!

"చంద్రబాబు వాహనంపై బాంబు వేస్తాం".. కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత..!

అలా చేస్తే.. చంద్రబాబు గౌరవం పెరిగేది : వైకాపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.