'దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం' అంటూ అధికార వైకాపాపై మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కోటగుడ్డం గ్రామంలో రైతు కోసం తెలుగుదేశం.. మహా పాదయాత్ర తలపెట్టారు. ఈ సందర్బంగా పలువురు రైతుల పొలాల్లో వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం విస్మరించిందని పేర్కొన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు రైతులకు అందించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం ఇవ్వడంలో వైఫల్యం చెందిందన్నారు.
రాష్ట్రంలో వైకాపా నాయకులు దోచుకుంటున్నారని... దొంగల ప్రభుత్వంగా మారిపోయిందని అనంతపురం నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులతోపాటు కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జీ ఉమామహేశ్వర నాయుడు, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో..
వైకాపా పాలనలో తెదేపా నాయకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే వైకాపా భయపడుతోందని.. అందుకే అరాచకాలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. తాడిపత్రిలో పోలీసుల ఎదుటే దౌర్జన్యం జరుగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జగన్ నియంత పాలనపై కేంద్రం దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.
కడపలో..
రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా.. జిల్లా జమ్మలమడుగు మండలం పి బొమ్మేపల్లి గ్రామంలో తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న రైతు ముర్రా బాల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ నష్ట పరిహారం సరిగ్గా అందడం లేదని విర్శించారు.
ఇదీ చదవండి: