ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో సర్వనాశనం చేసిందని.. భవిష్యత్ అంధకారంలా కనిపిస్తోందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(yanamala ramakrishnudu) అన్నారు. పారిశ్రామికవేత్తలు కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదన్న యనమల.. యువతకు ఉద్యోగాలు(jobs) లేవన్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు(steel plant)ను అమ్మే హక్కు కేంద్రానికి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని యనమల మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం కేంద్రంతో లాలూచి పడుతున్నారని విమర్శలు సంధించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పలేకపోతున్న జగన్(jagan).. తెదేపా(tdp) హయాంలో చంద్రబాబు(chandrababu).. అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌తో చర్చలు జరిపి ప్రైవేటీకరణను ఆపగలిగారని యనమల గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరమైతే నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని.. 8500 మంది నిర్వాసితులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
Minister Buggana: 'రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయి.. అర్థరహిత విమర్శలొద్దు'