ETV Bharat / city

కుప్పం ఘటనపై డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ - కుప్పంలో పోలీసుల తీరుపై వర్ల రామయ్య లేఖ

Varla Ramaiah letter to DGP కుప్పంలో చంద్రబాబు పర్యటనలో పోలీసుల తీరుపై డీజీపీకి తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. కుప్పం ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు అధికార పార్టీకి వత్తాసు పలికినట్లు స్పష్టంగా తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు.

Varla Ramaiah letter to DGP
డీజీపీకి వర్ల రామయ్య లేఖ
author img

By

Published : Aug 25, 2022, 4:12 PM IST

Varla Ramaiah letter to DGP on Kuppam incident: కుప్పం ఘటనపై రాష్ట్ర డీజీపీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు... ఆ శాఖకు తీరని మచ్చని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఆయన డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డికి లేఖ రాశారు. కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరు... అధికార పార్టీతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమవడం చాలా బాధాకరమన్నారు. ఆర్టికల్ 19ను ఉల్లంఘిస్తూ అసమ్మతి స్వరాన్ని అణిచివేస్తోందని మండిపడ్డారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతోనే ఎమ్మెల్సీ భరత్ శాంతి భద్రతల సమస్య సృష్టించారనేది సుస్పష్టమని ఆరోపించారు. అధికార పార్టీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. చంద్రబాబు పర్యటనకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించక ముందే అధికార పార్టీ కార్యకర్తలు క్యాంటీన్‌పై దాడి చేసి ధ్వంసం చేయడం దారుణమని దుయ్యబట్టారు.

TENSION AT KUPPAM: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు తొలిరేజే ఆటంకాలు సృష్టించిన వైకాపా.. రెండో రోజు మరింత అలజడికి యత్నిస్తోంది. నిన్నటి రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు కార్యకర్తలంతా కుప్పం రావాలని వైకాపా నాయకులు వాట్సప్ సందేశాలు పంపారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు,... చలో కుప్పం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని శ్రేణులు తరలిరావాలని కోరారు.

ఇరు పార్టీల సవాళ్లు, నిన్నటి పరిణామాల దృష్ట్యా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా బస్టాండ్ సహా కుప్పంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్టీసీ బస్సులను ఆపివేయించారు. దీనివల్ల బస్సులు డిపోకే పరిమితం కావడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఆధునికీకరించిన పార్టీ కార్యాలయంతో పాటు నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే.. వైకాపా నిరసనల దృష్ట్యా చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.