డ్రగ్స్ నియంత్రణపై దృష్టి సారించకుండా తమపై దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం(TDP leader payyavula keshav fire on drugs moving in andhrapradhesh) వ్యక్తం చేశారు. వైకాపా మంత్రుల పరుష పదజాలం జగన్కు వినపడవా ? అని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ పేరు మారుమోగిపోతోందని మండిపడ్డారు. గంజాయికి(ganja) ప్రజలు బానిస కాకూడదన్న లక్ష్యంతో తాము పోరాటం చేస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణా, సాగుపై ప్రశ్నిస్తే దాడులు(assault) చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు. ప్రభుత్వ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లకు భయపడం...
అమాయకులైన పిల్లలు మత్తులోకి జారిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పయ్యావుల ఆవేదన వ్యక్తం చేశారు. తమపై నమోదు చేస్తున్న తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లకు(FIR) భయపడేది లేదని వెల్లడించారు. డ్రగ్స్ నివారణలో పోలీసు వ్యవస్థ(police department) నిర్వీర్యమవుతోందని ఆరోపించారు. తద్వారా కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పోలీసు వ్యవస్థ... అంతర్మథనంతో నలిగిపోయే వ్యవస్థగా మారిందని పయ్యావుల ఎద్దేవా చేశారు.
సీబీఐ విచారణ జరగాలి...
మంగళగిరి తెదేపా కార్యాలయం(TDP office)లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకున్నామని తెదేపా నేత పయ్యావుల అన్నారు. ఈ ఘటనపై ఆరా తీయగా అతను... డీజీపీ కార్యాలయంలో(DGP office) పీఆర్వోగా పనిచేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. తెదేపా కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయని తెలిపారు. సూత్రధారులు, పాత్రధారులు తెలియాలంటే సీబీఐ విచారణ(CBI inquiry) జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
బుద్ధి చెబుతాం...
అధికారం ఉందని దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని తెదేపా నేత పయ్యావుల కేశవ్ హెచ్చరించారు(payyavula keshav warning to ycp government). డీజీపీ పాత్రపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని(court) ఆశ్రయించి, అన్ని విషయాలు తేలుస్తామని వివరించారు.
డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ పేరు మోగిపోతోంది. గంజాయిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు భయపడేది లేదు. అధికారం ఉందని దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతాం. అమాయకులైన పిల్లలు మత్తులోకి జారిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లకు భయపడం. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
-పయ్యావుల కేశవ్, తెదేపా నేత
ఇవీచదవండి.