'అధికారిక లెక్కలు చూస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని తేలిపోయింది. రాష్ట్రంలో వెంటిలేటర్ పడకలు కేవలం 693 మాత్రమే అందుబాటులో ఉంటే, ఆక్సిజన్ పడకలు 1397 ఉన్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 45,689 కొవిడ్ కేసులుంటే కేవలం 37 ఐసీయూ పడకలు, 4 వెంటిలేటర్ పడకలు, 108 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఒక్క పడక కూడా ఖాళీ లేదు. ఇవన్నీ జగన్ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనాలు. ప్రజల జీవితాలకే సీఎం సున్నాచుట్టారని తేలిపోయింది. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లోనే పడకలు లేకపోతే పేదలు ప్రాణాలకు రక్షణ ఏది?' అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి.. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
'రెండేళ్లలో ఆసుపత్రుల్లో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని డాష్ బోర్డు సమాచారం స్పష్టం చేస్తోంది. తొలిదశ కొవిడ్ వ్యాప్తి నుంచి ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ఏం సమకూర్చిందో సమాధానం చెప్పాలి. వ్యాక్సిన్లు తెప్పించి ప్రజల ప్రాణాలు కాపాడకుండా, తయారీ కంపెనీలకు కులాన్ని అంటకట్టడం దుర్మార్గం. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దృష్టి సారించకుండా కక్షసాధింపులు, అక్రమకేసులతో సమయాన్ని వృథా చేస్తున్నారు. అంతగా కావాలంటే ఎవరిని అరెస్టు చేయాలనుకుంటున్నారో చెప్తే వారే స్వచ్ఛందంగా జైలుకెళ్తారు' అని పట్టాభి ఆక్షేపించారు.
ఇదీ చదవండి:
కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్