Pattabhi: బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు జగన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. ఏపీఎస్ డీసీ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి.. బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల రుణాలు కొల్లగొట్టాడని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ల రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ కఠిన ఆదేశాలు జారీ చేయడం జగన్ రెడ్డి దోపిడీ విధానాలకు పర్యవసానమని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రలో ఆర్థిక ఉగ్రవాదాన్ని చూసిన తర్వాతే.. జూన్ 14, 2022న షెడ్యూల్డ్ బ్యాంకులకు ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయడం పరిస్థితికి అద్దం పడుతోందని పట్టాభి పేర్కొన్నారు. కార్పొరేషన్లకు అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గ్యారంటీని క్రైటీరియాగా తీసుకుని అప్పులు ఇవ్వడానికి వీల్లేదని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆర్బీఐ ఆదేశాలు అమలవుతున్నాయా, లేదా అని బ్యాంకులు 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉందని తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్ అవసరాల కోసమే ఏపీఎస్డీసీ ఏర్పాటు చేస్తున్నట్లు జీవో 80లో జగన్ పేర్కొన్నారని పట్టాభి తెలిపారు. జగన్ జారీ చేసిన జీవో ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనేనని ఆరోపించారు. రూ. 25వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ కోసం ఇచ్చిన జీవో నెం.92 కూడా ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనేనని ఆక్షేపించారు.
ఇవీ చూడండి: