వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం 'మసిపూసి మారెడుకాయ' రీతిన ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఈ విధానం వలన చిన్న, సూక్ష్మ పరిశ్రమలు మూతబడే పరిస్థితి రాబోతోందన్నారు.
తెలుగుదేశం హయాంలో తూర్పుగోదావరి జిల్లా పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందన్న చినరాజప్ప.. జగన్మోహన్ రెడ్డి పాలనలో జిల్లాలో అభివృద్ధి అటకెక్కిందని మండిపడ్డారు. పాడైన రోడ్లకు ప్యాచ్ వర్కులు కూడా చేయలేని దుస్థితి ఉందని విమర్శించారు. అభివృద్ధిని గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. కేసులకు తగ్గ వైద్య సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి..
'రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆ ముగ్గురికి పంచాలని చూస్తున్నారు'