అమరావతికి శంకుస్థాపన జరిగి నేటితో ఐదేళ్ల కాలం పూర్తయిన నేపథ్యంలో... కేంద్రం కలగ జేసుకోవాలని తెదేపా విజయవాడ పార్లమెంటు కన్వీనర్ నెట్టెం రఘురాం, పార్టీ కోశాధికారి శ్రీరాం తాతయ్య కోరారు. 300 రోజులు పైగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఆంధ్రులు ప్రగతి కోసం అమరావతిని రాజధానిగా చేస్తే..వైకాపా రాజధానిని నీరుగార్చిందని విమర్శించారు. 16 నెలల పాటు సాగిన రాజధాని పనులు నిలిచిపోయాయన్నారు. అమరావతి నిలిచిపోవడంతో.. ఆంధ్రుల ప్రగతి రథచక్రాలు ఆగిపోయాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : తెలంగాణ: దీక్షిత్ కిడ్నాప్ నుంచి హత్య వరకు.. అసలేం జరిగింది?