ప్రభుత్వమే యువత(youth)ను మాదకద్రవ్యాలకు బానిసల్ని చేస్తోందని.. తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు(tdp leader nakka nandbabu) ఆరోపించారు. గంజాయి(ganjai) రవాణాపై తెలంగాణ పోలీసులు(telangana police) దాడిచేసే వరకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గంజాయి సాగు(ganja cultivation), రవాణాకు ప్రభుత్వం సాయం చేస్తోందని ఆరోపించారు.
చిత్తూరు జిల్లాలో.. మంత్రి అనుచరులే ఓపీఎం ముడిపదార్థాల సాగు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మాదకద్రవ్యాల నియంత్రణ విభాగాలు.. దీనిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ మన్యంలో సాగవుతున్న రూ.8వేల కోట్ల గంజాయి సాగు వెనుక.. విజయసాయిరెడ్డి అనుచరుల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.25వేల కోట్లు ఉందని తెలిపారు. గిరిజనలు బతుకుల్ని ఛిద్రం చేస్తూ వారిపైనా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మాదకద్రవ్యాలకు కేంద్రంగా ఏపీని మార్చటం హేయమని మండిపడ్డారు.
ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా..
గంజాయి వ్యాపారం చేస్తున్నానని మంత్రి సుచరిత.. తనపై ఆరోపణలు చేశారని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాలు వదిలిపెడతానని.. గంజాయి రవాణాలో పోలీసులకు వాటాలు ఉన్నాయని ఆయన అన్నారు.
గంజాయి వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి..
గంజాయి వ్యవహారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని.. తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేెశారు. గంజాయి, లిక్విడ్ గంజాయి టన్నులకొద్దీ తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి: