తిరుపతి ఉప ఎన్నికలో వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వాలంటీర్లతో రహస్య మీటింగ్ నిర్వహించటం దుర్మార్గమని మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీతో పాటు ఇతర అనైతిక కార్యక్రమాలు చేయించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు సంబంధంలేని అంశాలపై ఫిర్యాదులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి